Breaking News

పెళ్లయి 9 ఏళ్లు.. ఇంకా పిల్లలు వద్దంటోంది: నటుడు

Published on Thu, 08/28/2025 - 14:30

హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌ (Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఈ షోను లాంచ్‌ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టారు. వారిలో బుల్లితెర నటుడు గౌరవ్‌ ఖన్నా (Gaurav Khanna) ఒకరు! తాజాగా ఓ ఎపిసోడ్‌లో యూట్యూబర్‌ మృదుల్‌ తివారీతో తన కుటుంబ విషయాలను చర్చించాడు. నా భార్య పేరు ఆకాంక్ష చమోలా (నటి).. ఈ ఏడాది నవంబర్‌ నాటికి మా వైవాహిక జీవితానికి 9 ఏళ్లు నిండుతాయి అని చెప్పాడు.

పిల్లలంటే ఇష్టం.. భార్య వద్దంటోంది
ఎంతమంది పిల్లలు అని మృదుల్‌ అడగ్గా.. ఎవరూ లేరని బదులిచ్చాడు గౌరవ్‌. నా భార్య పిల్లలు వద్దంటోంది. కానీ, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. కాబట్టి తనేం చెప్పినా నేను ఒప్పుకుని తీరాల్సిందే! ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలను మనం గౌరవించాల్సిందే! తను అన్నదాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే మాపై చాలా బాధ్యతలున్నాయి. నేను షూటింగ్స్‌ కోసం రోజంతా బయటే ఉండాల్సి వస్తుంది. తను కూడా షూటింగ్స్‌తో బిజీగా ఉంటుంది. 

ఎవరు చూసుకుంటారు?
అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుంటే వారిని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యతను బయటవారికి అప్పజెప్పడం మాకిష్టం లేదు. ఓసారి నాకు పిల్లలు కావాల్సిందేనని తన దగ్గర పట్టుపట్టాను. అప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక తను చెప్పింది కూడా కరెక్టే అనిపించి చైల్డ్‌ ప్లానింగ్‌ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.

దాంపత్యానికి 9 ఏళ్లు
గౌరవ్‌.. సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్‌ ఇండియా రియాలిటీ షోలో పాల్గొని టైటిల్‌ గెలిచాడు. ఆ షోలోనే ఆకాంక్షతో ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్‌లో ఆమెను తొలిసారి చూడగానే లవ్‌లో పడ్డానని, అలా అతడే ధైర్యం కూడదీసుకుని ఓ అడుగు ముందుకేసి ఆమెతో మాట కలిపానని తెలిపాడు. అలా తమ జర్నీ పెళ్లివరకు వచ్చిందన్నాడు. గౌరవ్‌- ఆకాంక్ష 2016లో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)