Breaking News

రంజాన్‌ ఉపవాసంపై సింగర్‌ అనుచిత వ్యాఖ్యలు.. నటి ఫైర్‌

Published on Sat, 04/01/2023 - 15:35

మోడల్‌, నటి గౌహర్‌ ఖాన్‌ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో తను ఉపవాసం ఉంటుందా? లేదా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. దీనికి గౌహర్‌ స్పందిస్తూ.. గర్భంతో ఉన్నందున ఈ ఏడాది రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉండటం లేదని తెలిపింది. దానికి బదులుగా నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది.

ఇకపోతే హాలీవుడ్‌​ పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ దంపతులు రంజాన్‌ మాసంలో ఉపవాసం చేయడంపై సెటైర్లు విసిరారు. 'మేమైతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మా శరీరాలకు పోషకాలు కావాలి. అందుకే ఆ ఆలోచన కూడా చేయం. అయినా ఇలా కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడమేంటో మాకిప్పటికీ అర్థం కాదు. అంతగా అవసరమైతే టీవీ చూడటం, సెల్‌ఫోన్‌ వాడటం మానేయండి. అంతే తప్ప తిండి మానేయడమేంటి? మరీ తెలివి తక్కువ వాళ్లలా ఉన్నారనిపిస్తోంది' అని వెకిలిగా మాట్లాడారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన గౌహర్‌ ఖాన్‌ సింగర్‌ జంటపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. దాని వెనక ఉన్న సైన్స్‌ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి కాస్తైనా తెలుసా? ముందు అవి తెలుసుకోండి. మీకంటూ ఓ అభిప్రాయం ఉండటం తప్పనడం లేదు. కానీ వాటిని ఎలా వ్యక్తీకరించాలనే తెలివి కూడా ఉంటే బాగుంటుంది' అని చురకలంటించింది.

ఇక గౌహర్‌ ఖాన్‌ విషయానికి వస్తే.. ఆమె సరుకులు కొనడానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు జైద్‌ దర్బార్‌ను కలిసింది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది స్నేహానికి దారి తీసింది. కొంత సమయానికే అది ప్రేమగా మారింది. 2020 నవంబర్‌ 5న వీరి నిశ్చితార్థం జరగ్గా డిసెంబర్‌ 25న పెళ్లి చేసుకున్నారు. 2022 డిసెంబర్‌లో తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది నటి. ఆమె చివరగా శిక్షా మండల్‌ సినిమాలో నటించింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)