Breaking News

ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది

Published on Tue, 07/07/2026 - 10:32

ఏ భాషలో చూసుకున్నా సరే ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ లేకపోతే ఏ సినిమాలు కూడా నిలబడవు. అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మహా అయితే కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వస్తాయి. అదే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తే లెక్క వేరే ఉంటుంది. రీసెంట్ టైంలో తెలుగులో అలా 'మా ఇంటి బంగారం' కనెక్ట్ అయింది. హిట్ అయింది. ఇప్పుడు దీనిలా తమిళంలో ఓ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఫుల్ గా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)

తమిళ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు. దీనికంటే తెలుగు షట్లర్ గుత్తా జ్వాల భర్తగానే చాలామందికి తెలుసు. ఇతడు హీరోగా నటించిన 'మట్టీ కుస్తీ' అనే సినిమా 2022లో రిలీజైంది. హీరో రవితేజ దీని నిర్మాణంలో భాగమయ్యాడు. కానీ ఇదేమంత సక్సెస్ కాలేదు. ఇలాంటి చిత్రానికి సీక్వెల్ తీస్తారని ఎవరైనా అనుకుంటారా? కానీ విష్ణు విశాల్ తీశాడు. అదే 'గట్ట కుస్తీ 2'. ఈసారి తమిళం వరకు మాత్రమే విడుదల చేశారు.

గత వీకెండ్ థియేటర్లలో రిలీజ్ చేయగా యావరేజ్, పర్లేదు అనే రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. కానీ కుటుంబ ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయిపోయింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల ‍గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. విష్ణు విశాల్ మార్కెట్‌కి ఇది చాలా ఎక్కువ. అసలు ఇది హిట్ అవుతుందని కూడా ఊహించి ఉండరు. అలాంటిది చూస్తుంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ వసూళ్లు తెచ్చుకునేలా కనిపిస్తోంది.

ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉంటే యావరేజ్ సినిమాకు వసూళ్లు ఎంతలా వస్తాయనేది 'గట్ట కుస్తీ 2' నిరూపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కుస్తీ ఫైట్, మూవీలోని కామెడీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి దీనిని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా? లేదంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)