ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ

Published on Sun, 08/02/2026 - 15:12

సాధారణంగా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ తీస్తుంటారు. కానీ నాలుగేళ్ల క్రితం థియేటర్లలో రిలీజై పెద్దగా ఆడని చిత్రానికి రెండో భాగాన్ని తీశారు. అదే 'గట్ట కుస్తీ 2'. గత నెలలో తమిళంలో విడుదలై ఊహించని సక్సెస్ అందుకుంది. రూ.50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. రెండు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)

కథేంటి?
తన భార్య కీర్తి(ఐశ్వర్య లక్ష‍్మి)ని రెజ్లింగ్ ఛాంపియన్ చేస్తానని మాట ఇచ్చిన వీర(విష్ణు విశాల్) దాన్ని నిలబెట్టుకుంటాడు. రైల్వేలో ఆమె ఉద్యోగం చేస్తుండటంతో వీర, హౌస్ హజ్బెండ్‌గా మారి ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. కూతురు మది(జారా)కి స్నానం చేయించడం, స్కూల్‌లో దిగబెట్టడం, మళ్లీ తీసుకురావడం లాంటివన్నీ చేస్తుంటాడు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ల సంసారంలో రెజ్లింగ్ కోచ్(తారక్ పొన్నప్ప) కారణంగా మనస్పర్థలు వస్తాయి. కీర్తి-వీర విడివిడిగా ఉండాల్సి వస్తుంది. అసలేమైంది? చివరకు భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
భార్యభర్తల నేపథ్యంగా సాగే కామెడీ సినిమాలకు పెద్దగా కథ అవసరం లేదు. కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా గిల్లికజ్జాలు, హాస్యం, ఎమోషన్స్, గ్లామర్ టచ్ ఇస్తే చాలు. 'గట్ట కుస్తీ 2' విషయంలో అలానే చేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ ఓ మాదిరిగా ఆడింది. అయితే అందులో ఉన్నట్లే ఇందులోనూ భార్యభర్తల కామెడీ చూపిస్తూ రెండున్నర గంటలు ఎంటర్‌టైన్ చేసేశారు.

వీర తన ఇంటి బాధ్యతల్ని చూసుకోవడంతో సినిమా మొదలవుతుంది. ఓవైపు కీర్తి రెజ్లింగ్‌లో రోజురోజుకు ఎదుగుతుండగా.. మరోవైపు వీర డైలీ రొటీన్ సాగుతూ ఉంటుంది. అయితే తన భర్త.. కూతురి స్కూల్ టీచర్ వైపు ఆకర్షితుడవుతున్నాడని తెలిసి రుసరుసలు మొదలవుతాయి. అలా సరదాసరదాగా ఫస్టాప్ సాగిపోతుంది. ఎప్పుడైతే వీర అనుకోకుండా చేసిన ఓ పనివల్ల కీర్తి ఓ మ్యాచ్‌లో ఓడిపోతుందో కథలో సంఘర్షణ మొదలవుతుంది.

ఫస్టాప్ అంతా కామెడీగా సాగతుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎమోషనల్, కామెడీ, కోర్టు, లాయర్ తదితర సన్నివేశాలు మరింతగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్స్, స్కూల్‌ టీచర్‌తో వీర చేసే డ్యాన్స్, హంగామా నవ్విస్తుంది. స్టోరీ అంతా కామెడీగా చూపిస్తున్నప్పటికీ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు. తమని తాము కాపాడుకునేందుకు చిన్నప్పటి నుంచే వాళ్లకు ఆత్మరక్షణ ఎందుకు అవసరం? లాంటి విషయాల్లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది.

విడాకుల కోసం నిర్వహించే కుస్తీ పోటీని క్లైమాక్స్‌లో రొమాంటిక్‌గా డిజైన్‌ చేయడం మంచి వినోదాన్ని పంచుతూనే మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. భార్య లేదా భర్త గెలిస్తే కథలో మజాపోయే అవకాశముంటుంది. అందుకే ఇద్దరికీ సమప్రాధాన్యం ఇచ్చేలా చేయడం ఆసక్తికరంగా అనిపించింది. అయితే భార్యభర్తల గొడవలోకి మూడో వ్యక్తి రాకూడదనే సందేశాన్ని చివరలో చూపించడం బాగుంది. తర్వాత ఏం జరుగతుందో ఊహించేలా ఉండటం ఈ మూవీకి మైసన్.

వీరగా విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే ఇతడి కంటే కీర్తి పాత్ర చేసిన ఐశ్వర్య లక్ష‍్మిని బాగా చూపించారు. గ్లామర్ పరంగా చీరలో ఈమెని, స్కూల్ టీచర్‌గా చేసిన మోక్షని భలే గ్లామరస్‌గా చూపించారు. వీళ్ల తర్వాత వీర-కీర్తి కూతురిగా చేసిన జారా క్యూట్‌గా అదరగొట్టేసింది. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ల ముగ్గురితో ప్రేమలో పడిపోతాం. మిగిలిన వాళ్లలో కరుణాస్, మునిష్కాంత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు సందర్భానికి తగ్గట్లు సాగిపోయాయి. తెలుగు డబ్బింగ్ సరిగ్గా సరిపోయింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే మంచి టైమ్ పాస్ మూవీ ఇది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)