Breaking News

కొత్త బిజినెస్‌.. ఫ్రెండ్‌కు అప్పజెప్పిన నటుడు.. అంతేకాదు!

Published on Sat, 03/30/2024 - 14:32

సినిమా రంగంలో నిజమైన మిత్రులు కొందరే ఉంటారు. నటుడు గంజాకరుప్పు, గీత రచయిత జయంకొండాన్‌ ఆ కోవలోకే వస్తారు. గంజాకరుప్పు ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు, కథానాయకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు.

20 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్‌
గీత రచయిత జయంకొండాన్‌.. వేటప్పన్‌, ఇంద్రసేనా, ఓడుం మేఘంగళ్‌, ఒరు సంధిప్పిల్‌, సొక్కు సుందరం తదితర చిత్రాలకు పాటలను రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు గేయరచయితగా పని చేస్తున్న ఈయన స్థానిక కేకే.నగర్‌లో కవింజర్‌ కిచెన్‌ పేరుతో హోటల్‌ నడుపుతున్నారు. గంజాకరుప్పు, జయంకొండాన్‌లు 20 ఏళ్లుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. 

ఫ్రెండ్‌కు పెళ్లి చేసే బాధ్యత కూడా!
తాజాగా గంజాకరుప్పు త్వరలో ఊరంపాక్కమ్‌లో ప్రారంభించనున్న హోటల్‌ నిర్వహణ బాధ్యతలను గీత రచయిత జయంకొండాన్‌కు అప్పగించనున్నారు. అంతేకాదు ఇంకా అవివాహితుడిగా ఉన్న తన మిత్రుడికి పెళ్లి చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఇందుకోసం డాక్టర్‌ చదివిన యువతిని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో స్నేహమంటే వీరిదే.. అని కోలీవుడ్‌ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. కాగా నటుడు గంజాకరుప్పు భార్య కూడా వైద్యురాలు అన్న విషయం తెలిసిందే.

చదవండి: ముగ్గురు కుమార్తెలతో భారమైన జీవితం.. లారెన్స్‌ సాయం.. వీడియో వైరల్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)