Breaking News

స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్‌ చూశారా?

Published on Mon, 04/14/2025 - 11:13

గంగవ్వ (Milkuri Gangavva).. ఎరుకనే కదా! అమాయకత్వం, బోలాతనం, గడబిడ మాట్లాడే వైఖరితో అందరికీ సుపరిచితమైంది. యూట్యూబ్‌ ఆమెను అందరికీ చేరువ చేసింది. తెలంగాణ యాసతో ఆమె మాట్లాడుతుంటే మనింట్లో బామ్మ ముచ్చటచెప్పినట్లే ఉంటది. మై విలేజ్‌ షో ద్వారా నేషనల్‌ కాదు ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఫేమస్‌ అయింది. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లోనూ పాల్గొని తన హుషారుతో అందర్నీ నవ్వించింది.

గంగవ్వ కొత్త లుక్‌
ప్రస్తుతం మళ్లీ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్న ఆమె తాజాగా కొత్త లుక్‌తో అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చిన ఆమె బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ వీజే సన్నీ ప్రారంభించిన టీబీసీ సెలూన్‌కు వెళ్లింది. ఇంకేముంది.. సన్నీ దగ్గరుండి గంగవ్వ జుట్టు కడిగించి, దానికి నల్ల రంగు వేయించాడు. పనిలో పనిగా కొత్త హెయిర్‌ స్టైల్‌ కూడా ట్రై చేసింది గంగవ్వ. జుట్టు స్ట్రెయిటినింగ్‌ చేయించుకుని వదిలేసింది. అవసరమైతే తలకు నూనెంటకుండా ఈ హెయిర్‌ స్టైల్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తానంది. కాలికి పెడిక్యూర్‌ కూడా చేయించుకుంది.

సినిమాలు
 ఫైనల్‌గా గంగవ్వ కొత్త లుక్‌ చూసిన అభిమానులు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు. గంగవ్వ యూట్యూబ్‌ స్టార్‌ కాకముందు ఓ వ్యవసాయ కూలీ. తనకు ముగ్గురు పిల్లలు. రెక్కల కష్టంతో ముగ్గురు పిల్లల పెళ్లి చేసింది. మలి వయసులో యూట్యూబర్‌గా మారడమే కాకుండా సినిమాల్లోనూ అడుగుపెట్టింది. మల్లేశం, ఇస్మార్ట్‌ శంకర్‌, లవ్‌ స్టోరీ, ఇంటింటి రామాయణం, స్వాగ్‌, గేమ్‌ ఛేంజర్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది.

చదవండి: 'జాట్'‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయండి.. ఫైర్‌ అవుతున్న తమిళులు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)