Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా

Published on Fri, 03/21/2025 - 14:39

'పుష్ప' సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్(Director Sukumar)కి ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు అబ్బాయి కాగా, సుకృతి (Sukrithi) అనే కుమార్తె కూడా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించగా.. అది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆ మూవీ సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీతాత చెట్టు' (Gandhi Tatha Chettu Movie ). ఇందులో ఈమె స్టూడెంట్ గా నటించింది. సుకుమార్ భార్య బబితనే మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించింది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24న థియేటర్లలో రిలీజైంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)

ఈ సినిమాలో కంటెంట్ పర్లేదనే టాక్ వచ్చింది కానీ సంక్రాంతికి రిలీజైన మూవీస్ వల్ల 'గాంధీతాత చెట్టు' అనే చిత్రం ఒకటి రిలీజైందని తెలియనంత వేగంగా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. అలాంటిది దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు సడన్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.

'గాంధీతాత చెట్టు' విషయానికొస్తే.. నిజామాబాద్ జిల్లా అడ్లూర్. గాంధీ మహాత్ముడి గుర్తుగా రామ‌చంద్ర‌య్య (ఆనంద చ‌క్ర‌పాణి) ఓ చెట్టు నాటుతాడు. ఎప్పుడూ ఆ చెట్టు చెంత‌నే గ‌డుపుతూ, అందులోనే త‌న ప్రాణం ఉంద‌ని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని న‌మ్మి అనుస‌రించే ఆయ‌న...  త‌న మ‌న‌వ‌రాలికి గాంధీ (సుకృతి) అని పేరు పెడ‌తాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు. ఊరిలోనూ, కుటుంబంలోనూ  చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా రామ‌చంద్ర‌య్య త‌న భూమికి, చెట్టుకు దూర‌మ‌య్యే ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్‌: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్‌..?)

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)