Breaking News

'గేమ్ ఛేంజర్‌ ఈవెంట్‌లో ఆసక్తికర సన్నివేశం'.. యాంకర్ సుమపై శంకర్ ప్రశంసలు!

Published on Thu, 01/02/2025 - 20:29

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో డైరెక్టర్ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని కొనియాడారు. రామ్ చరణ్ ఆర్టిస్ట్‌ కంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే ఇందులో కనపడుతుందని ప్రశంసలు కురిపించారు. నా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్నీ కూడా గేమ్ ఛేంజర్‌లో ఉంటాయన్నారు. తమన్‌ బీజీఎం ఏఆర్‌ రెహమాన్‌ను తలపించేలా చేశారని కితాబిచ్చారు. ఈ  సందర్భంగా ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి నటనను శంకర్‌ ప్రశంసించారు. తమిళ  డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథతోనే గేమ్ ఛేంజర్‌ మూవీని తెరకెక్కించినట్లు శంకర్ తెలిపారు.  అయితే ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ, డైరెక్టర్‌ శంకర్‌ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అదేంటో చూసేద్దాం.

గేమ్ ఛేంజర్‌లో రాజీవ్ కనకాల అద్భుతమైన నటనతో మెప్పించారని శంకర్ అన్నారు. అదే సమయంలో సుమ కనకాల మధ్యలో వచ్చిన ఆయన నా భర్త సార్ అని అన్నారు. దీనికి బదులిస్తూ ఆ విషయం నాకు తెలుసు.. మిమ్మల్ని చాలా ఏళ్లుగా చూస్తున్నాని అన్నారు. స్టేజ్‌పై వేల మంది ఆడియన్స్‌ ఉన్నప్పటికీ అందరినీ కంట్రోల్ చేసే సత్తా మీకుందని సుమను పొగిడారు. కానీ నా భర్త మీద మాత్రమే కంట్రోల్ లేదు సార్‌ సుమ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ ఫన్నీ సంభాషణతో అక్కడున్నవారంతా ముసిముసి నవ్వులు చిందించారు.

కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)