Breaking News

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడక ఎప్పుడంటే..?

Published on Tue, 04/22/2025 - 10:40

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులకి (Gaddar Film Awards) వేదిక ఖరారు అయింది. రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  ఛైర్మన్‌ దిల్‌రాజు (Dil Raju) ఏర్పాట్లకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధ (Jayasudha)తో పాటుగా 15మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్‌రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు.  జూన్‌ 14న హెచ్‌ఐసీసీ వేదికగా గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉంటుందని వారు ప్రకటించారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  గద్దర్  అవార్డ్స్‌ కార్యక్రమం గురించి ఇలా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డ్స్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమకు చెందిన వారికి  ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సహకాలతో పాటు అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇలా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి భావించారని భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమని ఆయన అన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. 

అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయంగా భావించామన్నారు. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల  గురించి మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల జాబితాను జ్యూరీ ఛైర్మన్ జయసుధకు భట్టివిక్రమార్క, దిల్‌రాజు అందించారు. ఎంపిక అయిన 35 చిత్రాలను జ్యూరీ సభ్యులతో కలిసి  డిప్యూటీ సీఎం వీక్షించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల  భట్టి విక్రమార్క శ్రద్దాంజలి ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం వల్ల నేడు విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణను వాయిదా వేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ జరిపిస్తామని వారు తెలిపారు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)