Breaking News

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!

Published on Mon, 08/28/2023 - 20:11

ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా అందరూ సినిమాలు తెగ చూసేస్తున్నారు. దీనితోపాటు ప్రతివారం థియేటర్లలో కొత్త మూవీస్ రిలీజ్ కావడం లేటు.. వాటి టాక్ ఏంటి? ఒకవేళ బాగోలేకపోతే ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయి అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఓ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పుడు స్వయంగా దర్శకుడే క్లారిటీ ఇచ్చేశాడు. అది కాస్త కన్ఫ్యూజ్ చేస్తోంది.

సినిమా టాక్ ఏంటి?
2001లో 'గదర్' సినిమా రిలీజ్ అద్భుతమైన టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. దానికి 22 ఏళ్ల సీక్వెల్ తీసి, ఈ మధ‍్యే రిలీజ్ చేయగా ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటివరకైతే దాదాపు రూ.450 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కెరీర్ అయిపోయిందనుకున్న సన్నీ డియోల్ కి ఈ సినిమా మంచి జోష్ తీసుకొచ్చింది. నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ చూస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ)

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ శర్మ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అలానే ఓటీటీ రిలీజ్ గురించి స్పందించారు. 'ప్రస్తుతం ప్రేక్షకులు 'గదర్ 2'ని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. నాకు తెలిసినంతవరకు మరో ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అనుకుంటున్నాను' అని అనిల్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఆరు నెలలు.. కుదరదేమో?
అయితే 'గదర్ 2' హిట్ అయిన ఆనందంలో ఉన్న దర్శకుడు అనిల్ శర్మ.. ఓటీటీ రిలీజ్ ఆరు నెలల తర్వాత అన్నాడు. కానీ అన్ని నెలలు ఎవరూ వెయిట్ చేయరు. అలానే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5.. అంతకాలం అస్సలు సినిమాని దాచిపెట్టుకోదు కదా. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 5-6 వారాల తర్వాత అనుకున్నాసరే సెప్టెంబరు చివరికల్లా 'గదర్ 2' ఓటీటీలోకి వచ్చేయొచ్చు.

(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)