కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
థియేటర్లలో బ్యాండ్ మేళం, సుయోధన.. ఓటీటీల్లో ఒక్క రోజే 11 సినిమాలు..!
Published on Thu, 03/26/2026 - 19:58
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారం తెలుగులో 'కోర్ట్' జంట నటించిన బ్యాండ్ మేళం, ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'యూత్', 'హ్యాపీరాజ్' రిలీజ్ అవుతున్నాయి .
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే క్రేజ్ ఉన్న మూవీస్ ఏమీ రావట్లేదు. విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్ మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫ్రైడే పెద్దగా ఆసక్తి పెంచే చిత్రాలేవీ కనిపించడం లేదు. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27
మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27
ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 27
53 సండేస్(హాలీవుడ్ మూవీ)- మార్చి 27
అమెజాన్ ప్రైమ్
ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27
జియో హాట్‌స్టార్
కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27
జీ5
ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27
హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27
ఆపిల్ టీవీ
ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27
సన్ నెక్ట్స్
మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27
Tags : 1