Breaking News

సాయం చేస్తానంటూ రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

Published on Sat, 11/30/2024 - 07:49

కోలీవుడ్‌ నటుడు,కొరియోగ్రాఫర్‌  రాఘవ లారెన్స్‌ పేరు చెప్పుకుని పలు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిరుపేదలకు లారెన్స్‌ సాయం చేస్తూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు దానినే ఆసరాగ చేసుకున్న ఈ కేటుగాడు పేదల నుంచి డబ్బు దోచుకునే ప్లాన్‌ వేశాడు.

పోలీసులు తెలుపుతున్న ప్రకారం..  చెన్నైలోని ఎగ్మూర్‌కి చెందిన వీరరాఘవన్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారెన్స్‌ పేరుతో తనను మోసం చేశారని ఆయన చెప్పడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి తనకు మొదట ఫోన్‌చేసి తాను  రాఘవ లారెన్స్‌ వద్ద  సహాయకుడిగా పనిచేస్తానని చెప్పి నమ్మించాడని వాపోయాడు.  లారెన్స్‌ స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నారని, అందులో మీ బిడ్డ చదువు ఖర్చు మొత్తం వారే భరిస్తారని చెప్పి ఆపై అందుకుగాను  రూ.8,457 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని కోరాడు. దీంతో తాను ఆ నగదు ఫోన్‌ పే ద్వారా చేశానన్నాడు.

అయితే, రెండురోజుల తర్వాత  మళ్లీ అతను చెప్పిన మాటలు నమ్మి రెండు దపాలుగా రూ.2,875, రూ.50 వేలు పంపినట్లు తెలిపాడు. కానీ, అతనిపై అనుమానం కలగడంతో తన నగదు తిరిగివ్వాలని కోరడంతో అసలు నిజం బయటపడిందని వాపోయాడు. చాలాసార్లు కాల్‌ చేస్తున్నా కూడా రెస్పాండ్‌ కాకుండా సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  వేలూర్‌లో ఉన్న దినేష్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించారు.  ఎగ్మూర్‌ కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకి అతన్ని తరలించారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)