Breaking News

బిగ్‌బాస్‌ షోలో ఛాన్స్‌ వస్తే.. పీలింగ్స్‌ సింగర్‌ ఏమందంటే?

Published on Sun, 07/13/2025 - 16:54

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప 2 మూవీలో వస్తుండాయి పీలింగ్స్‌ పాట ఎంత సెన్సేషన్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట కోసం సినిమా ఇండస్ట్రీలోని టాప్‌ సింగర్స్‌ను కాదని జానపద గాయని దాస లక్ష్మితో పాడించారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మి చిన్నప్పటినుంచే ఫోక్‌ సాంగ్స్‌ పాడుతుండేది. పలు పాటల ప్రోగ్రామ్స్‌లోనూ పాల్గొనేది. యూట్యూబ్‌ వల్ల లక్ష్మి చాలా పాపులర్‌ అయింది. 

పుష్ప 2లో ఛాన్స్‌
తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే.., ఆనాడేమన్నంటినా తిరుపతి.. నిన్ను ఈనాడేమన్నంటినా తిరుపతి వంటి పాటలు ఆమెకు బోలెడంత పేరు తెచ్చిపెట్టాయి. ఇంకేముంది, దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌.. లక్ష్మి టాలెంట్‌ గురించి తెలుసుకుని వెంటనే పుష్ప 2లో ఛాన్స్‌ ఇచ్చారు. అలా ఆమె వస్తుండాయి పీలింగ్స్‌ పాట పాడింది. అంతకుముందు బ్యాచ్‌ మూవీలో ఓ పాట, దసరాలో ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్‌ పాడింది.

బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ వస్తే..
బిగ్‌బాస్‌ షోలో ఛాన్స్‌ వస్తే వెళ్తారా? అన్న ప్రశ్నకు లక్ష్మి తాజాగా ఇలా స్పందించింది. బిగ్‌బాస్‌ షోకి వెళ్లాలన్న ఆలోచనే రాలేదు. ఎందుకంటే నా భర్త, ఏడాదిన్నర పిల్లాడే నా ప్రపంచం. వారిని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లలేను. బాబు ఇంకా చిన్నవాడు కాబట్టి దుబాయ్‌, మస్కట్‌ వంటి దేశాల్లో మూడు, నాలుగు రోజుల ప్రోగ్రామ్స్‌ ఉంటేనే వెళ్లలేకపోతున్నాను. నేను బిగ్‌బాస్‌ షో చూస్తూ ఉంటాను. ఒకవేళ ఛాన్స్‌ వస్తే వెళ్లడానికి ప్రయత్నిస్తాను అని లక్ష్మి చెప్పుకొచ్చింది.

చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్ల ఆస్తి ఉంటేనేం? 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)