Breaking News

జాను లిరితో బ్రేకప్‌? క్లారిటీ ఇచ్చిన సింగర్‌!

Published on Sun, 10/05/2025 - 08:48

యూట్యూబ్‌లో ఫోక్‌ సాంగ్స్‌తో దుమ్ము లేపింది జాను లిరి (Janu Lyri). పద్ధతిగా చీర కట్టి, పల్లెటూరి అమ్మాయిగా స్టెప్పులేసే జాను ఫోక్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాపులారిటీతో ఢీ డ్యాన్స్‌ షోలోనూ పాల్గొని విజేతగా నిలిచింది. జానూకి గతంలో నటుడు టోనీ కిక్‌తో పెళ్లవగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. విభేదాల కారణంగా టోనీతో విడిపోయిన జాను కుమారుడితో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె ఏం చేసినా సరే సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతూ ఉంటుంది.

రెండో పెళ్లి చేసుకుంటా..
ఆ మధ్య ట్రోలింగ్‌ తట్టుకోలేకపోతున్నా.. చచ్చిపోవాలనుంది అంటూ బోరుమని ఏడ్చింది. ఆ మరుసటి రోజే.. నేనెవరికీ భయపడను.. బాధతో డిప్రెషన్‌కు వెళ్లిపోయాను, ట్రోల్స్‌ను పట్టించుకోను అని ధైర్యం కూడదీసుకుంది. అంతేకాదు, ఫోక్‌ సింగర్‌ దిలీప్‌ దేవ్‌గణ్‌ (Dilip Devgan)తో దిగిన ఫోటో షేర్‌ చేస్తూ అతడే తనకు కాబోయే భర్త అని పరిచయం చేసింది. రెండో పెళ్లి చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది.

హ్యాపీగా ఉన్నాం
మే నెలలో తమ ప్రేమను బయటపెట్టిన వీరిద్దరూ ఈ మధ్యే విడిపోయారంటూ తాజాగా ప్రచారం ఊపందుకుంది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియా ఖాతా నుంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ఈ రూమర్స్‌పై దిలీప్‌ స్పందించాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని ఒక్కముక్కలో తేల్చేశాడు. కానీ, ఈ విషయంపై అంతకుమించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

చదవండి: 'నేషనల్‌ క్రష్‌' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)