Breaking News

గలీజ్‌ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి

Published on Fri, 05/02/2025 - 16:37

జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్‌ అయింది. యూట్యూబ్‌లో ఫోక్‌ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్‌ చేస్తున్నారు.

గుక్కపెట్టి ఏడ్చిన జాను
ఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్‌ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్‌ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్‌.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్‌ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్‌ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.

బతకాలని లేదు
ఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్‌ మాటలు యాడ్‌ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్‌ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్‌ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.

నా వల్ల కావట్లేదు
వాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది.

 

 

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
 

చదవండి: హీరోయిన్‌ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్‌ ప్యాక్‌ చేశా: అల్లు అర్జున్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)