Breaking News

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై కేసు పెట్టండి: కోర్టు

Published on Wed, 08/27/2025 - 08:14

బాలీవుడ్‌ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వారిద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నివాసి కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. షారుఖ్ , దీపికా(Deepika Padukone) ప్రమోట్‌ చేస్తున్న హ్యూందాయ్‌ కంపెనీకి చెందిన కారు కొనుగోలు చేసి తాను తీవ్రంగా నష్టపోయానని సింగ్‌ చెబుతున్నాడు.

కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు  రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు.  అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్‌ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. కానీ, తను చెబుతున్నట్లుగా హ్యుందాయ్ అల్కాజార్ కారు మోడల్‌ ఇంజన్‌లో ఎలాంటి లోపాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

హ్యూందాయ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా పనిచేస్తున్న షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆపై వారిద్దరి మీద కేసు నమోదుచేయాలంటూ భరత్‌పూర్‌లోని CJM కోర్టులో ఆయన పిటీషన్‌ దాఖలు చేశాడు. సెక్షన్ 420 (మోసం) ఇతర సంబంధిత సెక్షన్ల కింద FIR నమోదు చేయాలని  మధుర గేట్ పోలీస్ స్టేషన్‌ను కోర్టు ఆదేశించింది. షారుఖ్ ఖాన్ 1998 నుండి ఆ కంపెనీ  బ్రాండ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపికా పదుకొణె డిసెంబర్ 2023 నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. 2024లో ఇద్దరూ కలిసి ఒక ప్రకటనలో కూడా కనిపించారు. తప్పుదారి పట్టించే ప్రకటనలకు సెలబ్రిటీలతో పాటు ఎండార్సర్లు కూడా బాధ్యత వహించాలని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశించింది.  ఈ క్రమంలోనే కంపెనీకి చెందిన ఆరుగురి సిబ్బందితో పాటు షారుఖ్‌, దీపికలపై కేసు నమోదైంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)