Breaking News

'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్‌ వీడియోలు బయటపెట్టమంటావా?' బుల్లితెర నటి

Published on Sun, 10/26/2025 - 12:14

యశవంతపుర (కర్ణాటక): టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్‌లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్‌ (Asha Jois) నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్‌ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్‌ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది. పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. 

డబ్బు ఇవ్వకపోవడంతో.. 
ఆశా జోయిస్‌.. 2016లో మిస్‌ ఇండియా ప్లానెట్‌ పోటీలలో విజేతగా నిలిచింది. టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. తర్వాత బాధిత మహిళ పార్వతితో స్నేహం పెంచుకుంది. తాను టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్‌ రికార్డ్‌లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల అందరి ముందు అభాసుపాలయ్యాని, ఘోర అవమానం జరిగిందంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి: నారా రోహిత్‌-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)