హైదరాబాద్ నడిబొడ్డున బయటపెడతా.. ఏంటి తమాషాలా..
Breaking News
వదంతులను నమ్మొద్దు.. భారతి రాజా కూతురి ప్రకటన
Published on Mon, 01/05/2026 - 10:22
సీనియర్ సినీ దర్శకుడు భారతీరాజా ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా అంజీకరైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా గురించి గత మూడు రోజులుగా రకరకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీంతో భారతి రాజా గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు జనని స్పందించారు. ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన తండ్రి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని చెప్పారు. కాగా దర్శకుడు భారతీరాజా ఆరోగ్య వంతంగా ఇంటికి తిరిగి రావాలని, గీత రచయిత వైరముత్తు, తదితర సినీ ప్రముఖులతో పాటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
భారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు.
Tags : 1