Breaking News

రకుల్ ప్రీత్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ట్రైలర్ వచ్చేసింది

Published on Tue, 10/14/2025 - 22:05

అజయ్‌ దేవగణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, టబు లీడ్‌ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్‌ దే’. అకివ్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా దే దే ప్యార్‌ దే 2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరోసారి రకుల్, అజయ్ కనిపించనుండగా.. టబు మాత్రం నటించడం లేదు. అయితే సీక్వెల్‌కు అన్షుల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‍అజయ్ దేవగణ్, రకుల్ మధ్య కామెడీ సీన్స్‌ నవ్వులు తెప్పిస్తున్నాయి. మీ బాయ్‌ఫ్రెండ్‌ వయస్సు.. మీ నాన్న వయసంత ఉంటే.. అంటూ ట్రైలర్‌ను పోస్ట్ చేసింగి రకుల్ ప్రీత్  సింగ్. కాగా.. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, గౌతమి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం చిల్ర్డన్స్‌ డే సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించడంతో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.

 

 

Videos

తులం కొనాలంటే.. పొలం అమ్మాల్సిందే..

తిరుపతిలో YSRCP శ్రేణుల ధర్నా

తురకపాలెంలో ప్రజలు ఎందుకు చనిపోతున్నారో కనిపెట్టలేవా?

భరణి దివ్య రిలేషన్.. అన్నయ్య అంటుంది కానీ.. నాకు డౌటే

Abhinay: ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదు

మద్యం అక్రమ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం

Malladi Vishnu: పేరుకే అనుభవం అభివృద్ధిలో శూన్యం

బాబుపై చురకలు.. జగన్ పై పరోక్ష ప్రశంసలు

గజదొంగ చంద్రబాబు కరణం ధర్మశ్రీ నాన్ స్టాప్ సెటైర్లు

పిచ్చి పరాకాష్టకు అంటే ఇదే.. ప్రధాని మోదీ సభకు కమర్షియల్ టార్గెట్స్

Photos

+5

తెలంగాణలో గుప్త ఆలయం! సాహసోపేతమైన ప్రయాణం.. కోపాన్ని తగ్గించే కోనేరు.. మీకు తెలుసా? (ఫొటోలు)

+5

దీపావళి ఈవెంట్‌లో సెలబ్రిటీలు.. ఇండస్ట్రీ అంతా ఒకేచోట (ఫొటోలు)

+5

దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్‌లో సన్నీ లియోన్ (ఫొటోలు)

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)