Breaking News

ప్రభాస్‌ ‘ఫౌజీ’పై కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్‌ సిగరెట్లా..?

Published on Sun, 10/25/2026 - 18:51

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య సంభాషణలతో మొదలైన గ్లింప్స్‌ ఆసక్తిని పెంచింది. అయితే ఇందులో ప్రభాస్ నోట్లో సిగరెట్‌తో భారీ మెషిన్ గన్‌ను ఆపరేట్ చేస్తున్న సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

స్వాతంత్రానికి ముందే సిగరెట్లు ఉన్నాయా?
‘ఫౌజీ’ గ్లింప్స్‌లో ప్రభాస్ నోట్లో సిగరెట్ పెట్టుకుని మెషిన్ గన్‌ను ఆపరేట్ చేస్తున్న సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కథ 1942 నేపథ్యంలో సాగుతుండటంతో.. ఆ కాలంలో ఫిల్టర్ సిగరెట్లు అందుబాటులో ఉండేవా? అనే సందేహాలు మొదలయ్యాయి.

చరిత్రను పరిశీలిస్తే.. 1947కు ముందే బ్రిటిష్ పాలనలో భారత్‌లో సిగరెట్ల తయారీ, విక్రయాలు జరిగేవి. అయితే ఫిల్టర్ సిగరెట్లు ప్రపంచ మార్కెట్‌లోకి వచ్చిన కాలం, భారత్‌లో అవి విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన కాలం ఒకటే కాదు. అమెరికాలో 1930లలోనే ఫిల్టర్ సిగరెట్ల విక్రయాలు ప్రారంభమైనట్లు చారిత్ర చెబుతోంది. కానీ 1942 నాటికి భారత్‌లో వాటి లభ్యత ఎంతవరకు ఉండేదనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఫౌజీ’లో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర వివిధ ప్రాంతాలు, దేశాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా చూపిస్తున్నారనే సంకేతాలు గ్లింప్స్‌లో కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అతడి చేతిలో కనిపించిన సిగరెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు సినిమా విడుదలయ్యాక మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

‘ఫౌజీ’ విషయానికి వస్తే..
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో మరాఠీ నటుడు సుభోధ్ భవే కనిపించారు. బ్రిటిష్ నటుడు ఇయాన్ ఫ్లెచర్ హిట్లర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఇమాన్వీ ఇస్మాయిల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

(ఇదీ చదవండి: బాలనటిగా అరంగ్రేటం చేసిన ప్రముఖ నిర్మాత కూతురు)

 

Videos

Big Alert: ఈ రాష్ట్రంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

విర్రవీగుతున్న ఒక్కొక్కడిని చెప్తున్నా.. 2029 అధికారంలోకి వస్తే.. మీ ఊహకే వదిలేస్తున్న..

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

Photos

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)