Breaking News

రాజాసాబ్‌ రిలీజ్‌.. థియేటర్లలో మొసళ్లు!

Published on Fri, 01/09/2026 - 07:43

డార్లింగ్‌ ప్రభాస్‌ హారర్‌ జానర్‌లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్‌ షోస్‌ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్‌ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్‌లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.

థియేటర్‌లో మొసళ్లు?
అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్‌ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్‌ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్‌ అని నినాదాలు చేస్తున్నారు. 

అదీ సంగతి!
ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్‌ మూవీలో ప్రభాస్‌ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్‌లోనూ ఆ క్లిప్‌ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్‌లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు. 

సినిమా
రాజాసాబ్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్‌ నటులు సంజయ్‌దత్‌, బొమన్‌ ఇరానీ, జరీనా వాహబ్‌ కీలక పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైంది.

 

 

చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ

Videos

ట్రాఫిక్ దెబ్బకు కారు వదిలేసి నడుచుకుంటూ..

సనాతన వేషగాళ్ళ పాలనలో మహిళపై టీడీపీ నేత కుల బహిష్కరణ

మరో బిగ్ సీక్వెల్ కన్ఫర్మ్.. రెబల్ ఫ్యాన్‌కు పండగే..

కోనసీమ బ్లోఅవుట్.. ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు అదుపులోకి మంటలు

బోర్డర్ 2 రిలీజ్... దురంధర్ రికార్డులు బ్రేక్ అవుతాయా?

కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..

రేవంత్ తో కుమ్మక్కై.. సీమకు సమాధి.. చివరకు కథ అడ్డం తిరిగింది

Pothina Mahesh : దుర్గమ్మ సన్నిధిలో మహా అపచారం.. చంద్రబాబు నిర్లక్ష్య పాలన

భూ సర్వే రాయి పై జగన్ ఫోటో..! బాబుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన పేర్ని నాని

Manohar Reddy: కేక్ కట్ చేసినా కేసా..? ఇదెక్కడి న్యాయం..?

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన.. ఆషికా, డింపుల్‌ (ఫొటోలు)

+5

'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)

+5

క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)

+5

ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)

+5

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)

+5

తెలంగాణ : సంక్రాంతి సంబరాలలో సచివాలయం ఉద్యోగులు (ఫొటోలు)

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)