Breaking News

రాజమౌళి బిగ్ ఈవెంట్‌.. హోస్ట్‌గా ప్రముఖ యూట్యూబర్!

Published on Thu, 11/13/2025 - 17:08

మహేష్‌ బాబు - రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ29. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు మన దర్శకధీరుడు. ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేయడంతో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ రివీల్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. టైటిల్‌ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా? అని మహేశ్ బాబు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి బిగ్ ఈవెంట్‌ ప్లాన్ చేశారు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్‌ బాబు ఫ‌స్ట్ లుక్‌ను రివీల్‌ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్‌ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్‌ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

(ఇది చదవండి: మహేష్‌ బాబు సినిమా ఈవెంట్‌.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి)

అయితే తాజాగా ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌ ఈవెంట్‌కు హోస్ట్‌ ఎవరన్నది కూడా టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు మన స్టార్ యాంకర్‌ సుమ ఉండనే ఉంటుంది. సుమతో పాటు ప్రముఖ యూట్యూబర్‌ ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌గా పనిచేయనున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఆశిష్ చంచలానీ హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఓ ఫన్నీ వీడియో ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. రాజమౌళితో కలిసి ఈ వీడియోను రూపొందించారు.

కాగా.. తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు గ్లోబ్ ట్రాటర్‌ ‍అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బిగ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని రివీల్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దాదాపు  50 వేల మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న సాయంత్రం 7 గంటలకు జియోహాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

 

 

Videos

బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్

వేధింపులకే చనిపోయారా? టీటీడీ ఉద్యోగి మృతిపై అనుమానాలు

జూబ్లీ ఫలితాలపై సంచలన ప్రెస్ మీట్

ఎన్నికల ఫలితాలపై మాగంటి సునీత ఎమోషనల్

సీఎం రేంజ్ లో సవాల్ విసిరి తుస్సుమన్న PK

బీజేపీ ఓటమిపై దీపక్ రెడ్డి ఎమోషనల్

కాంగ్రెస్ చిత్తుచిత్తు.. 200 మార్క్ వైపు దూసుకుపోతున్న NDA

రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..

అమిత్ షా చెప్పిందే జరిగింది..

సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్

Photos

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)

+5

‘దేవగుడి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)