Breaking News

రణబాలిలో రాక్షసుడు.. విజయ్‌ దేవరకొండ అరుదైన ఘనత..!

Published on Wed, 06/17/2026 - 13:45

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలితో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్‌ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ మూవీ విలన్ అర్నాల్డ్ వోస్లో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీలో సర్ థియోడర్ హెక్టర్ అనే ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ స్వయంగా వెల్లడించారు. జూన్ 16న అ‍ర్నాల్డ్ వోస్లో పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. రణబాలిలో అర్నాల్ట్‌ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. నా చిన్నప్పుడు చూసిన సినిమాలలో 'మమ్మీ' నాకు ఎంతో ఇష్టమైన చిత్రమని రాసుకొచ్చారు. అందులోని ప్రతి పాత్ర నాకు నచ్చిందన్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా రాక్షసులు నిజంగా ఉండగలరని నమ్మేలా చేసింది మాత్ర.. ఆ సినిమాలోని ప్రతినాయకుడైన అర్నాల్డ్ వోస్లోనే అని ప్రశంసలు కురిపించారు.

అర్నాల్డ్ ఎంట్రీతో విజయ్ దేవరకొండ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ స్టార్స్‌తో నటించిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించారు. గతంలో విజయ్ హీరోగా వచ్చిన లైగర్‌ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో కలిసి నటించారు. ఇప్పుడు రణబాలిలో అర్నాల్డ్ వోస్లో ఎంట్రీతో ఏ హీరోకు సాధ్యం ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో నటించిన అరుదైన రికార్డ్‌ సాధించారు. కాగా.. రణబాలి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)