Breaking News

ఓటీటీలో క్రేజీ సిరీస్.. చాన్నాళ్లకు కొత్త అప్‌డేట్

Published on Wed, 06/25/2025 - 08:05

ఓటీటీల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సిరీస్‌లో 'ఫ్యామిలీ మ్యాన్' టాప్‌లో ఉంటుంది. అమెజాన్ ప్రై‍మ్‌లో ఇదివరకే రెండు సీజన్లు రాగా అవి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో మూడో సీజన్ కోసం వ్యూయర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. గతేడాది షూటింగ్ మొదలుపెట్టినట్లు అప్డేట్ రాగా.. కొన్నాళ్ల క్రితం దాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సరికొత్త అప్డేట్‌తో వచ్చేశారు.

మూడో సీజన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. 'అందరి కళ్లూ మా ఫ్యామిలీ మ్యాన్‌పైనే. కొత్త సీజన్ త్వరలో వస్తుంది' అని క్యాప్షన్ పెట్టారు. ఫొటోలో ఎప్పటిలానే శ్రీకాంత్ తివారీ(మనోజ్ భాజ్‌పాయ్) ఉండగా.. గన్స్ పట్టుకుని ముష్కరులు కూడా కనిపించారు. ఈ సీజన్ అంతా కూడా కొవిడ్19 నేప‌థ్య కథతో చైనా నుంచి ఇండియాపై జ‌రిగే దాడుల చుట్టూ ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే రెండో సీజన్ చివరలోనే హింట్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)

తొలి సీజన్‌లో మిషన్ జుల్ఫీకర్ ప్రధానంగా ఉండగా, రెండో సీజన్‌లో మిషన్ రాజీ చూపించారు. ఇప్పుడు మూడో సీజన్‌లో ప్రాజెక్ట్ గ్వాన్ యూ పేరిట జరగబోయే దాన్ని.. ప్రధాన పాత్రధారి శ్రీకాంత్ తివారీ ఎలా అడ్డుకున్నాడనేది చూపించబోతున్నారు. ఇందులో మనోజ్‌తోపాటు ప్రియమణి, ఆశ్లేషా ఠాకుర్, షరీబ్ అష్మీ, వేదాంత్ తదితరులు ఉన్నారు. జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. త‌మ కెరీర్‌లోనే ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3 షూటింగ్ అత్యంత క‌ష్టమైనదిగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే చెప్పుకొచ్చాడు. నాగాలాండ్‌తోపాటు దేశ సరిహద్దుల్లో షూటింగ్ చేయడమే దీనికి కారణం.

ఇకపోతే కొన్నాళ్ల క్రితం ఓ సందర్భంలో మాట్లాడిన మనోజ్ భాజ్‌పాయ్.. నవంబరులో మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుందని చెప్పాడు. మరికొందరు మాత్రం ఆగస్టు 15న రావొచ్చని అంటున్నారు. ఏదేమైనా ఈ సిరీస్ కొత్త సీజన్ కోసం వ్యూయర్స్ కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అప్డేట్ రావడంతో కాస్త ఖుషీ అయిపోతున్నారు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా)

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)