Breaking News

కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌

Published on Sun, 08/17/2025 - 12:56

కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), వడివేలు నటించిన చిత్రం 'మారీశన్‌'(Maareesan).. జులైలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.  కామెడీ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ఈ మూవీ సుదీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్‌లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠతకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్‌స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.

ఆగష్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మారీశన్‌ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.  తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌కి మరో విభిన్న పాత్రను అందించగా, వడివేలు హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కూడా చూపించారు. మీరు కామెడీ థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడితే.. మారీశన్ తప్పక చూడవచ్చు.

దయాలన్ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్‌ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. వేలాయుధం తన స్నేహితుడిని కలవడానికి ఊరికి బయలుదేరుతాడు. దయాలన్‌ అతన్ని మాటలతో మాయ చేసి, తన బైక్‌పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? దయాలన్‌ దోచుకున్నాడా..? లేక వేలాయుధం పరిస్థితిని చూసి మారిపోయాడా..? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమాలో ఉంటుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)