Breaking News

షారూఖ్‌ 'అంకుల్‌'.. నిజంగా అంతమాట అనేసిందా?

Published on Thu, 01/22/2026 - 19:12

హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్‌గ్రీన్‌ స్టార్స్‌గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్‌ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్‌ షారూఖ్‌ ఖాన్‌ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..

అక్కడ మొదలైంది
సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవలే జాయ్‌ అవార్డుల ఫంక్షన్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్‌ వంటి పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ హాజరయ్యారు. బాలీవుడ్‌ నుంచి షారూఖ్‌ ఖాన్‌ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్‌ నటి హండె ఎర్సెల్‌ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్‌.. షారూఖ్‌తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్‌లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్‌ ఖాన్‌కు పెద్ద అభిమాని అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం తీశారు.

ఎవరీ అంకుల్‌?
ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్‌ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే  తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్‌ను చూపిస్తూ ఎవరీ అంకుల్‌ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ స్క్రీన్‌షాట్‌ తెగ వైరలయింది.

అది ఫేక్‌
దీంతో నెటిజన్లు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్‌ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్‌ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్‌షాట్‌ ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్‌ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్‌ అనైతే అనలేదు అని ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. షారూఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం కింగ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్‌.. ఇంటాక్సికేటెడ్‌ బై లవ్‌, చేజింగ్‌ ద విండ్‌ అని రెండు టర్కిష్‌ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్‌ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్‌లోనూ యాక్ట్‌ చేస్తానంది.

ఫేక్‌ స్క్రీన్‌షాట్‌ (ఫోటోలో ఎడమవైపు)

చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్‌

Videos

విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..

RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం

బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు

కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

నువ్వు నాటిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా బాబుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు

కేటీఆర్ కు సిట్ నోటీసులు

విద్యుత్ చార్జీలు తగ్గించినట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం

ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు

Photos

+5

వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)

+5

స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)

+5

నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)