Breaking News

విడాకుల వివాదం.. ‘జన నాయకన్‌’ చూసిన సంగీత?

Published on Fri, 07/24/2026 - 12:45

తమిళనాడు నాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్‌’ (తెలుగులో జన నాయకుడు) భారీ అంచనాల మధ్య ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించకపోయినా.. విజయ్‌ ఫ్యాన్స్‌ని మాత్రం ఆకట్టుకుంది. అభిమానులు ఆశించే యాక్షన్‌, డ్యాన్స్‌, ఎమోషన్స్‌ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అలాగే పొలిటికల్‌ టచ్‌ కూడా ఇవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు టీవీకే పార్టీ శ్రేణులు కూడా సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక విజయ్‌ స్నేహితురాలు, స్టార్‌ హీరోయిన్‌ త్రిష కూడా ఈ సినిమా వీక్షించారు. ఆమె థియేటర్స్‌కి వెళ్లిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పాటు మరో వీడియో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. విజయ్‌ భార్య సంగీత కూడా ‘జన నాయకన్‌’ వీక్షించారట. ఆమె థియేటర్‌కి సినిమా చూసిన వీడియో ఒక్కటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

అయితే అసలు నిజం ఏంటంటే.. అది చాలా పాత వీడియో. గతంలో ఓ సినిమా కోసం థియేటర్‌కి వెళ్లిన సంగీత వీడియో క్లిప్పుని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో సంగీత కారులో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఉన్నాయి, ఆమె ముఖానికి మాస్క్ ధరించి, సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. ఈ వీడియోతో విజయ్ అభిమానులు ఆమె 'జన నాయకన్' చిత్రాన్ని చూడటానికి థియేటర్‌కు వచ్చారని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతది. దీన్ని కొత్త వీడియోలతో కలిపి ఆమె థియేటర్‌కు వెళ్లినట్లు చూపించడానికి ఉపయోగించారు.

విడాకుల వివాదం..
ఈ ఏడాది ప్రారంభంలో, విజయ్ భార్య సంగీత.. తన భర్త విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల ముందు ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. విజయ్‌.. వెరొక నటితో రిలేషన్‌లో ఉన్నారని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట మారుమోగిపోయింది. విజయ్‌ రిలేషన్‌లో ఉన్న నటి త్రిషనే అని ప్రచారం చేశారు. అది నిజం అన్నట్లుగానే త్రిష, విజయ్‌ కలిసి ఓ ఫంక్షన్‌ హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిచి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా త్రిష తన తల్లితో కలిసి ఆ వేడుకకు హాజరైంది. కానీ విజయ్‌ సతీమణి సంగీత, పిల్లలు మాత్రం హాజరు కాలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)