'వీరమల్లు'కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?

Published on Wed, 09/03/2025 - 10:55

పవన్ కళ్యాణ్ హీరోగా నటించి హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ కావడతో సుమారు రూ.60 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. దీంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కనీసం తమకు జీఎస్‌టీ అయినా చెల్లించాలని నిర్మాతను బయ్యర్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. తాను కూడా నష్టపోయానని సంబంధం లేదని తేల్చిచెప్పినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. సుమారు రూ. 18 కోట్ల జీఎస్‌టీలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశాన్ని సినిమాటోగ్రఫీ మాజీ మంత్రి పేర్ని నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జీఎస్‌టీ బిల్లు లేకుండానే అనుమతి
హరి హర వీరమల్లు టికెట్ల రేట్లు పెంపు, జీఎస్‌టీ అంశం గురించి పేర్ని నాని ఇలా అన్నారు. ' ఏపీలో సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తెచ్చిన జీఓ ప్రస్తుత ప్రభుత్వం కొట్టివేయలేదు. కానీ, దానిని పాటించకుండా వారికి ఇష్టం వచ్చనట్లు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఒక్క జీఎస్టీ ప్రూఫ్‌ కూడా ఇవ్వకుండా కేవలం తెల్లకాగితంతో నిర్మాత వెళ్లితే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అందరికీ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఇది తప్పనిపించలేదా.? అందరిని ప్రశ్నిస్తానని చెప్తాడు.. కానీ, ఆయన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేడు. సూక్తులు మాత్రమే చెప్తాడు.. వాటిని ఆయన ఎంత మాత్రం పాటించడు.' అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీఓ ఎందుకు రద్దు చేయలేదు?
సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీఓ గురించి నాని ఇలా అన్నారు. 'హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్‌ సినిమాలకు మాత్రమే టికెట్‌ ధరలు పెంచుకోవాలని మేము జీఓలో చెప్పాం. అందుకు సంబంధించిన జీఎస్టీ ప్రూఫ్స్‌ కూడా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే టికెట్‌ ధరల పెంపునకు అనుమతి తీసుకోవాలని గతంలో మేము జీఓ జారీ చేశాం. బ్లాక్‌ టికెట్ల అమ్మకాలు నిలువరించేందుకు అడ్డుకట్ట వేశాం. 

దీంతో పవన్‌ కల్యాణ్‌ ఊగిపోయారు. సినిమాల కోసం తాము పెట్టుబడిపెట్టుకుని నిర్మించుకుంటే ప్రభుత్వ జోక్యం ఏంటి అంటూ ఆయన రెచ్చిపోయారు. తాము తెచ్చిన ప్రభుత్వ జీఓపై నోటికొచ్చింది మాట్లాడుతూ ఊగిపోయారు. కానీ, ఇప్పటికీ అదే జీఓను ఏపీ సినిమా పరిశ్రమలో ఎందుకు కొనసాగుతుంది..?' అని నాని ప్రశ్నించారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)