Breaking News

హార్దిక్‌తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి

Published on Wed, 06/25/2025 - 11:31

సినిమా, క్రికెట్ సెలబ్రిటీల బంధాల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అది నిజమైతే కొన్నిసార్లు అది పుకారుగానే మిగిలిపోతుంది. కొన్నిరోజుల క్రితం హార్దిక్ పాండ్య, నటి ఈషా గుప్తా డేటింగ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై సదరు నటి స్పందించింది. అసలేం జరిగిందో చెప్పి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.

'కొన్నినెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది. మేం డేటింగ్‌లో ఉన్నామని అనుకోవట్లేదు. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు.. డేటింగ్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ రిలేషన్‌లోకి అడుగుపెట్టకుండానే విడిపోయాం. రెండు, మూడుసార్లు కలిసుంటాం. కానీ కొన్నినెలల పాటు మా రిలేషన్ కొనసాగింది. తర్వాత అది ముగిసిపోయింది' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్?)

2012లో 'జన్నత్' అనే హిందీ సినిమాతో నటిగా ఈషా గుప్తా కెరీర్ ప్రారంభించింది. బేబీ, రుస్తుం, కమాండో 2 తదితర హిందీ చిత్రాల్లో నటించింది. వీడెవడు అనే తెలుగు మూవీలో హీరోయిన్‌గా చేసిన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లో ఐటమ్ సాంగ్‌లోనూ ఈమె మెరిసింది. 2019 తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. అయితేనేం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది.

హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. టీమిండియా తరఫున ఆల్‪‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్సీ చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే నటాషా స్టాంకోవిచ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్య అని కొడుకు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే హార్దిక్ సింగిల్‌గానే ఉంటున్నాడు.

(ఇదీ చదవండి: మరో హీరోయిన్‌తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)