Breaking News

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ ట్రైలర్‌ : సినిమా హిట్‌ కాకపోతే ఉరి తీసేయండి..

Published on Tue, 11/03/2026 - 18:33

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్‌).  తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ (2018) మూవీకి సీక్వెల్‌గా విశ్వక్‌ సేన్‌–తరుణ్‌ భాస్కర్‌ కాంబినేషన్‌లోనే ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ రూపొందింది. శ్రీనాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు. ఎస్‌ ఒరిజినల్స్, రూట్‌ నోడ్‌ సినిమా పతాకాలపై సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

(చదవండి: రావణుడి పది తలలకు.. పది గొంతులు ..​)

ఈ నగరానికి ఏమైంది సినిమాలో చివర్లో విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండతో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు చూపించారు. ఈ ట్రైలర్ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. ‘ఏమైంది రా స్టోరీ నచ్చలేదా(విశ్వక్‌ సేన్‌), ‘హా.. నువ్వు రాసింది ఏమన్నా టైటానిక్‌ అనుకుంటున్నావా? (అభినవ్‌).. అంటే మనకిప్పుడు పాన్‌ ఇండియా కలెక్షన్స్‌ రావు అంటున్నావు(వెంకటేశ్‌ కాకుమా), సినిమా హిట్‌ కాకపోతే వీడిని ఉరితీసేయండి(అభినవ్‌),  ‘పిచ్చెక్కిపోతుంది ఆడియన్స్‌కి’ లాంటి డైలాగ్స్‌తో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్‌ని కట్‌ చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే..  విశ్వక్ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఈ నలుగురు ఫ్రెండ్స్ బ్యాంకాక్ వెళ్లి అక్కడ పడ్డ ఇబ్బందులు, మధ్యలో కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)