Breaking News

ఆ హీరోయిన్‌ నాకు చెల్లెలు లాంటిది: దుల్కర్‌ సల్మాన్‌

Published on Fri, 09/05/2025 - 12:53

‘‘కల్యాణి ప్రియదర్శన్‌ నాకు చెల్లిలాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం. చంద్ర పాత్ర కోసం తను తప్ప మా మైండ్‌లోకి వేరే ఎవరి పేరు రాలేదు. నన్ను ఎలాగైతే మీవాడిగా భావించారో  అలాగే నేను నిర్మించిన ‘కొత్త లోక’ చిత్రాన్ని కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు. కల్యాణీ ప్రియదర్శన్‌ లీడ్‌ రోల్‌లో, నస్లెన్‌ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్‌ 1: చంద్ర’. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.

బడ్జెట్‌ గురించి ఆలోచించలే
డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ఆగస్టు 29న నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవానికి దర్శకులు నాగ్‌ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్‌ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్‌ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్‌ గురించి ఆలోచించలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్‌ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు’’ అని చెప్పారు. 

రూ.30 కోట్లు ఎక్కువ
నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళంలో రూ.30 కోట్లు అనేది చాలా ఎక్కువ. నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్‌ సల్మాన్‌ని అభినందించాలి’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘ఇలాంటి సూపర్‌ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నాగవంశీ. కల్యాణీ ప్రియదర్శన్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి, మాకు ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఉంది’’ అన్నారు డొమినిక్‌ అరుణ్‌.  

తండ్రి రియాక్షన్‌ ఇదే!
ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ.. యాక్షన్‌ హీరోగా నటించనున్నట్లు తండ్రి ప్రియదర్శన్‌కు చెప్పగా నువ్వా.. యాక్షన్‌ హీరో పాత్రలోనా! అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత చెయ్యి, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు.

చదవండి: కమెడియన్‌కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)