Breaking News

నా యాక్టింగ్‌పై నాకే డౌట్‌: దుల్కర్‌ సల్మాన్‌

Published on Fri, 11/14/2025 - 10:08

కొంతమంది నటులకు వంక పెట్టాల్సిన పనుండదు. సినిమా బాగున్నా, బాలేకపోయినా వారి నటన మాత్రం అద్భుతం అనేలా ఉంటుంది. అలాంటి నటుడే దుల్కర్‌ సల్మాన్‌. మలయాళ స్టార్‌ మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టిన దుల్కర్‌.. తక్కువకాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌ చిత్రాలతో తెలుగువారికి సైతం దగ్గరయ్యాడు. 

ఆ విమర్శలు చూస్తుంటా..
దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ కాంత. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్‌ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. నేను గొప్ప నటుడినని అనుకోవడం లేదు. నేను సరిగా యాక్ట్‌ చేయలేనని విమర్శించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వారి కామెంట్స్‌ చదివినిప్పుడు నాపై నాకే అనుమానం వేస్తుంది. 

వెంటాడే భయం
నిజంగా నేను బాగా నటించడం లేదా? అని చిన్న భయం వెంటాడుతుంది. ఆ భయమే నన్ను మరింత కష్టపడేలా చేస్తుంది. ఇంకా కఠినమైన పాత్రలు ఎంపిక చేసుకునేందుకు దోహదపడుతుంది. కొన్ని సినిమాలు చేసినప్పుడు.. ఆయా పాత్రల్లో నేను తప్ప మరే నటుడూ ఇమడలేడు అని జనం అనుకునేలా చేయాలని మరింత కసిగా కష్టపడతాను అని చెప్పుకొచ్చాడు.

సినిమా
దుల్కర్‌ సల్మాన్‌.. 2012లో సెకండ్‌ షో సినిమాతో కెరీర్‌ ప్రారంభించాడు. చార్లీ, మహానటి, కురుప్‌, సీతారామం వంటి చిత్రాలతో స్టార్‌ హీరోగా విశేష ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో ఆకాశంలో ఒక తార సినిమా ఉంది. అలాగే పూజా హెగ్డేతో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే తన చేతిలో మరో మలయాళ సినిమా కూడా ఉంది.

చదవండి: కాంత మూవీ రివ్యూ

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)