Breaking News

'డ్యూడ్‌' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ప్రదీప్‌ కెరీర్‌లోనే రికార్డ్‌

Published on Sat, 10/18/2025 - 15:39

డ్యూడ్‌ సినిమాతో తమిళ నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఈ మూవీ  తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేసింది. ఫస్ట్‌ డే నాడు లవ్‌ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల కలెక్షన్స్‌ కంటే డ్యూడ్‌ ఎక్కువే కొల్లగొట్టాడు. అక్టోబర్‌ 17న విడుదలైన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కీర్తిశ్వరన్‌ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఇందులో మితా బైజు, శరత్‌ కుమార్‌, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టి తదితరులు నటించారు. ప్రదీప్‌  గత రెండు చిత్రాలు భారీ విజయం అందుకోవడంతో డ్యూడ్‌ మూవీకి బాగానే కలిసొచ్చింది.

తొలిరోజే డ్యూడ్‌ దుమ్ములేపాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో సత్తా చాటాడు. ప్రదీప్‌ రంగనాథ్‌ కెరీర్‌లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా డ్యూడ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ప్రదీప్‌ గత చిత్రం రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ ఫస్ట్‌ డే  రూ. 14 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, ఆ సినిమా విజయం ఇప్పుడు ప్రదీప్‌కు బాగా కలిసొచ్చింది. ఆపై ఈ మూవీకి మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ బాగున్నాయని సమాచారం. దీపావళి సెలవు కూడా ఉండటంతో డ్యూడ్‌ బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ మార్క్‌ను చేరుకోవచ్చని తెలుస్తోంది.

సినిమా విడుదల కంటే ముందే సోషల్‌మీడియాలో ఈ మూవీకి బజ్‌ క్రియేట్‌ అయింది. ఆపై యూత్‌కు బాగా కనెక్ట్‌ కావడంతో థియేటర్స్‌ కూడా హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే  డ్యూడ్‌ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, డ్యూడ్‌ యూనిట్‌ నేడు అభిమానులను కలవనుంది. హైదరాబాద్‌లోని మల్లిఖార్జున థయేటర్‌ వద్దకు సాయంత్రం 6:30 షో టైమ్‌లో రానున్నారు. అక్కడి నుంచి మైత్రీ విమల్‌ థియేటర్‌కు రాత్రి 10:20గంటల షో టైమ్‌లో చేరుకుంటారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)