వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ

Published on Sun, 12/28/2025 - 17:28

బాలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాదిలో ఛావా, ధురందర్‌ చిత్రాలతో ఆయనకు పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపిన‌ట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

హిందీ ‘దృశ్యం -2’లో  అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్‌-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్‌ సెట్‌ చేసుకున్నామని పాఠక్‌ చెప్పారు. ఆ మేరకు అక్షయ్‌ ఖన్నాకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్‌లో అక్షయ్‌ ఖన్నా తమకు షాకింగ్‌ మెసేజ్‌ చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ కోసం అక్షయ్‌ ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

అక్షయ్‌ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375‌’ మూవీతో మంగత్‌ పాఠక్‌ లైఫ్‌ ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్‌ వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)