Breaking News

డోరెమాన్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్.. ఆ వాయిస్ మూగబోయింది

Published on Fri, 10/11/2024 - 20:17

ప్రముఖ కార్టూన్‌ క్యారెక్టర్స్‌లో డోరెమాన్ ఒకటి. చిన్నారులు ఎంతో ఇష్టపడే డోరెమాన్‌కు చాలా క్రేజ్ ఉంది. డోరెమాన్ కార్టూన్‌ సిరీస్‌ చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఈ సిరీస్‌లో డోరెమాన్‌, షుజుకా, నోబితా, జియాన్, సునియో క్యారెక్టర్స్‌ను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఈ డోరెమాన్‌ క్యారెక్టర్‌కు వాయిస్‌ ఇచ్చిన జపనీస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా మృతి చెందారు. ఈ కార్టూన్‌ సిరీస్‌లో 1979-2005 వరకు డోరెమాన్‌కు వాయిస్‌ ఇచ్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.

అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా (90) వయోభారంతో సెప్టెంబర్ 29న మరణించారు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించకపోవడంతో బయటికి రాలేదు. తాజాగా శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ వార్తను ఆలస్యం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపారు. నోబుయోపై చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. 1933లో టోక్యోలో జన్మించిన నోబుయో ఒయామా వాయిస్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సినిమాలు, షోలు, సిరీస్‌లలో వివిధ పాత్రలకు ఆమె డబ్బింగ్‌ చెప్పేవారు. సూపర్ మ్యాన్ జాంబోట్- 3లో కప్పే జిన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. 1964లో సహ నటుడైన  కీసుకే సగావాను వివాహం చేసుకున్నారు. 1979లో డోరెమాన్ ప్రారంభమైనప్పటి నుంచి 2005 వరకు నిరంతరాయంగా తన వాయిస్‌ అందించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)