Breaking News

తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Published on Sun, 02/08/2026 - 15:27

ఒకప్పుడు హీరోయిన్‌గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోవడం సహజం. కథానాయికగా అలరించినవారే తర్వాత అమ్మ, అత్త, వదిన పాత్రల్లో అలరిస్తుంటారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి వెండితెరకు దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటారు. నటి డాలీ మిన్హాస్‌ మొదటి కోవకు చెందినది. నేడు (ఫిబ్రవరి 8న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై ఈ ప్రత్యేక కథనం..

మోడలింగ్‌ నుంచి సినిమాలవైపు
డాలీ మిన్హాస్‌ అసలు పేరు డాలీ మాట్యూ. తనొక మోడల్‌. 1988లో ఫెమినా మిస్‌ ఇండియా యూనివర్స్‌ కిరీటం గెలుచుకుంది. 1989లో మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత్‌ తరపున పోటీ చేసింది. అలా మోడలింగ్‌ నుంచి సినిమాల్లో వచ్చింది. డాలీ కథానాయికగా నటించిన మొదటి మూవీ దస్తూర్‌ (1991). 

సినిమాలు
మిస్టర్‌ బాండ్‌, క్షత్రియ, గేమ్‌, ప్యార్‌ మే ట్విస్ట్‌, గుడ్‌ లక్‌, దిల్‌ దడక్కనే దో వంటి పలు సినిమాలు చేసింది. హిందీతో పాటు పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమాన్‌ బ్రహ్మచారి అని ఒకే ఒక్క సినిమా చేసింది. 1992లో వచ్చిన ఈ సినిమాలో సురేశ్‌ హీరోగా నటించాడు. చివరగా కబీర్‌ సింగ్‌ (2019) మూవీలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.

సీరియల్స్‌కు షిఫ్ట్‌
తొలి సినిమా దర్శకుడు అనిల్‌ మాట్యూతో ప్రేమలో పడిన డాలీ అతడినే పెళ్లి చేసుకుంది. రానురానూ సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్‌ అయిపోయింది. ఇస్‌ ప్యార్‌కో క్యా నామ్‌ ధూ?, ఏక్‌ బార్‌ ఫిర్‌, చోటీ సర్దామి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. మహాయోధ, శక్తిమాన్‌ సీరియల్స్‌లో నెగెటివ్‌ పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రేమ్‌ లీలా సీరియల్‌ చేస్తోంది. అలా ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన డాలీ ఇప్పుడు బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.

చదవండి: జీవితంలో సంతోషంగా లేను.. దమ్ము శ్రీజ

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు