Breaking News

దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్‌ చేయకండి: యాంకర్‌ రష్మి

Published on Wed, 09/25/2024 - 16:10

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్‌ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్‌ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్‌ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్‌ కావడంతో చివరకు రష్మి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.

‘మైనర్‌పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్‌ కౌచ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్‌ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్‌ చేసింది.

ఆ వీడియోలో ఏముందంటే..
రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి.  నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో.  ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం  చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్‌ చేస్తూ.. జానీ మాస్టర్‌ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్‌ చేస్తున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)