Breaking News

ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం

Published on Mon, 03/03/2025 - 11:48

బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుడ్‌ నటీనటులు పాల్గొనకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖలపై ఆయన భగ్గుమన్నారు. కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్‌లను టైట్‌ చేస్తామని సినీ ప్రముఖులను హెచ్చరించారు.  దీంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది. 

అయితే, తన వ్యాఖ్యలను కొంత సమయం తర్వాత డీకే సమర్థించుకున్నారు. 'సినిమా ప్రముఖులు ఏమికావాలంటే అది చేసుకోనీ, నాకు తెలియదు. నా మాటల్లో నిజాలున్నాయి. ధర్నాలు చేసినా ఫర్వాలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు' అని ఆయన ఆరోపించారు. మేకెదాటు పాదయాత్రలో ప్రేమ్‌, దునియా విజయ్‌, సాధుకోకిల పాల్గొన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కేసులు వేసిందని డీకే శివకుమార్‌ ఆరోపించారు. కాగా, కుంభమేళాలో స్నానం చేయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించారని ప్రశ్నించగా, అక్కడి నీటికి కులం, మతం ఉందా, ఏ పార్టీకై నా చెందిందా అని మండిపడ్డారు.

అధికార దర్పం: ఫిల్మ్‌ చాంబర్‌
డిప్యూటీ సీఎం ప్రకటనను కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు నరసింహలు ఖండించారు. అయన అధికార దర్పంతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కన్నడ కళాకారులందరూ పాల్గొనవలసి ఉంది. ఆహ్వానం అందని కారణంగా కొందరు పాల్గొనలేదని చెప్పారు.

మీకు సాధ్యమా: అశోక్‌
సినిమా రంగం, నటులపై డీకే శివకుమార్‌ మాటలను బీజేపీ పక్ష నాయకుడు ఆర్‌ అశోక్‌ ఖండించారు. మీరు చెప్పేది సాధ్యమా, ముందు మీ మంత్రి రాజణ్ణకు నట్లు బోల్టులను బిగించాలని హేళన చేశారు. కిచ్చ సుదీప్‌, కేజీఎఫ్‌ యశ్‌, దర్శన్‌ నట్లు బోల్టులను బిర్రు చేయడం మీకు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కన్నడ సినిమా రంగాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డీకే శివకుమార్‌ను అశోక్‌ డిమాండ్‌ చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)