Breaking News

ఓ పార్టీ నుంచి పిలుపొచ్చింది.. కానీ..: దివ్య సత్యరాజ్‌

Published on Sun, 03/03/2024 - 10:24

ప్రముఖ నటుడు సత్యరాజ్‌ కూతురు దివ్య సత్యరాజ్‌ ప్రముఖ న్యూట్రిషియన్‌.. ఆమె చాలా కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల తను రాజకీయ రంగప్రవేశం చేస్తానని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఓ మీడియా ప్రకటన చేశారు. అందులో.. తనను చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేయడానికి కారణం ఏంటి? ఎంపీగా పోటీ చేస్తారా? మంత్రి పదవి కోసం రాయకీయాల్లోకి వస్తున్నారా? వంటి పలు ప్రశ్నలు వేస్తున్నారని పేర్కొన్నారు.

రాజకీయ ఎంట్రీ నిజమే..
తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తానని చెప్పిన మాట నిజమేనని, అయితే ఏ పదవిని ఆశించో రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని, ప్రజలకు మంచి చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. తాను చాలా కాలంగా పేదలకు సేవలను అందిస్తూ వస్తున్నానని చెప్పారు. మహిళ్‌మతి ఇయక్కం పేరుతో మూడేళ్ల క్రితమే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. తద్వారా తమిళనాడులోని నిరుపేదలకు పుష్టికరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

అలాంటి పార్టీలో చేరే ఆలోచనే లేదు
అలాగే తనకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి పిలుపు వచ్చిందన్నారు. అయితే మతతత్వ పార్టీల్లో చేరే ఆలోచన తనకు లేదని, అలాగని తాను సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించనని చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఎన్నికలు ముగిసిన తరువాత వెల్లడిస్తానని దివ్య సత్యరాజ్‌ పేర్కొన్నారు. విప్లవ తమిళుడు సత్యరాజ్‌ కూతురిగా తమిళుల మంచి కోసం శ్రమిస్తానని ఆమె అన్నారు.

చదవండి: 'జైలర్‌' హిట్‌ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)