Breaking News

'బాలీవుడ్‌ అంతా మొసళ్లతో నిండిపోయింది'.. నటి సంచలన కామెంట్స్..!

Published on Fri, 12/05/2025 - 19:10

ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్య ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడింది. తాను విలువలతో రాజీ పడకుండా  నిజాయితీగా ఉంటానని తెలిపింది. అవకాశాల కోసం తానెప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని దివ్య ఖోస్లా పేర్కొంది. ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

దివ్య ఖోస్లా మాట్లాడుతూ..'బాలీవుడ్‌లో చాలా మొసళ్లు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నువ్వు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. పని కోసం నా ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడూ అమ్ముకోను. యూకేలో ఓ సినిమా కోసం సున్నా డిగ్రీల టెంపరేచర్‌లో దాదాపు 42 రోజుల పని చేశా. అది నా కెరీర్‌లో అత్యంత అద్భుతమైన షూట్.  దాదాపు మైనస్ 10 డిగ్రీలు.. అయినా కూడా నాన్-స్టాప్‌గా చిత్రీకరించాం. ఇతర సినిమాలతో పోల్చడానికి నాకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది.' అని తెలిపింది.

అంతేకాకుండా భూషణ్‌కుమార్‌తో విడాకులపై కూడా దివ్య ఖోస్లా స్పందించింది. మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ఆమె  క్లారిటీ ఇచ్చింది.  ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ మీడియా అది నిజం కావాలని కోరుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా.. ఆమె 2005లో టీ-సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే దివ్య ఖోస్లా చివరిసారిగా నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి నటించిన థ్రిల్లర్-కామెడీ ఏక్ చతుర్ నార్‌లో కనిపించింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు