Breaking News

ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్‌..!

Published on Tue, 11/19/2024 - 19:55

టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్‌లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్‌లో వివరించారు.

కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.

మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)