త్వరలో పాదయాత్ర.. వైఎస్ జగన్ క్లారిటీ
Breaking News
కేవలం సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి: రాకాపై అట్లీ ట్వీట్
Published on Wed, 04/08/2026 - 14:35
ఐకాన్ స్టార్ అభిమానులకు ఈ రోజు పండగే. బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. ఎక్కడా లీక్ కాకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. బన్నీ పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూవీకి రాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ.. హీరో అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. రాకా కేవలం సినిమా మాత్రమే కాదన్నారు. కొన్నేళ్లుగా నా వెంట మోసుకొస్తున్న భాగమన్నారు. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నా.. అది ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నానని అట్లీ ట్వీట్ చేశారు. అది నన్ను పరీక్షించడమే కాకుండా తీర్చిదిద్దేలా చేసిందన్నారు. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అట్లీ పోస్ట్ చేశారు.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs— atlee (@Atlee_dir) April 8, 2026
Tags : 1