Breaking News

అందుకే ఆపరేషన్ రావణ్‌ టైటిల్‌ పెట్టాం: వెంకట సత్య

Published on Tue, 07/23/2024 - 00:28

‘‘రామాయణం’లోని కొన్ని రిఫరెన్్సలను తీసుకుని మా సినిమా కథను రెడీ చేసుకున్నాం. అందుకే మా చిత్రానికి ‘ఆపరేషన్  రావణ్‌’ అనే టైటిల్‌ పెట్టాం. అయితే ‘రామాయణం’లో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు. మా మూవీలో మాస్క్‌ పెట్టుకుని వస్తాడు’’ అని డైరెక్టర్‌ వెంకట సత్య అన్నారు. రక్షిత్‌ అట్లూరి, సంగీర్తనా విపిన్‌ జోడీగా రాధికా శరత్‌కుమార్, చరణ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించిన న్యూ ఏజ్‌ సస్పెన్స్  థ్రిల్లర్‌ మూవీ ‘ఆపరేషన్  రావణ్‌’. ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ వెంకట సత్య మాట్లాడుతూ– ‘‘కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, రాజమౌళి, స్టీవెన్  స్పిల్‌బర్గ్‌గార్లు నా ఫేవరేట్‌ డైరెక్టర్స్‌. రాజమౌళిగారిలాంటి దర్శకుడు ధైర్యంగా ముందడుగు వేసి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి సినిమాలు చేయకపోతే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ఆస్కార్‌ అందుకునేది కాదు.

ఇక ‘ఆపరేషన్  రావణ్‌’ విషయానికొస్తే.. ఓ మనిషి సైకోగా ఎందుకు మారతాడు? అనే అంశాన్ని చూపిస్తున్నాం. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్‌తో షూటింగ్‌ పూర్తి చేశాం. అయితే సినిమా తీసినంత సులభంగా రిలీజ్‌ చేసుకోలేమని తెలుసుకున్నాను. నా కొడుకు రక్షిత్‌ అట్లూరి పాత్ర, నటన బాగుంటాయి. ‘పలాస 2’ సినిమా ఆలోచనలో ఉన్నాం. మా బ్యానర్‌ నుంచి ఏడాదికో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)