Breaking News

టీజర్‌ చూసి అశ్లీల చిత్రం అనుకున్నారు: డైరెక్టర్‌

Published on Mon, 09/22/2025 - 11:37

కోలీవుడ్‌లో తెరకెక్కిన 'బ్యాడ్‌ గర్ల్‌'(BadGirl Movie) చిత్రం పలు వివాదాలు ఎదుర్కొని సెప్టెంబర్‌ 5న విడుదలైంది.  వర్షా భరత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వెట్రిమారన్‌, అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల తర్వాత పాన్‌ ఇండియా రేంజ్‌లో అభ్యంతరాలు రావడంతో  అతికష్టం మీద కొన్ని మార్పులు చేసి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది.  అయితే, తాజాగా దర్శకురాలు వర్షా భరత్‌ మాట్లాడుతూ.. ఈ  మూవీ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారని,  ఇదేం అశ్లీల చిత్రం కాదని పేర్కొన్నారు.

బ్యాడ్‌ గర్ల్‌ మూవీలో అంజలి శివరామన్‌ ప్రధాన పాత్రలో నటించగా.. శాంతిప్రియ కీలక పాత్ర పోషించారు. గతంలో  వెట్రిమారన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన   వర్షా భరత్‌ తొలిసారిగా ఈ మూవీని దర్శకురాలిగా తెరకెక్కించారు. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. బ్యాడ్‌ గర్ల్‌ టీజర్‌ విడుదల తర్వాత ఈ చిత్రాన్ని  ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రోటర్‌డ్యామ్‌లో ప్రదర్శించామన్నారు. అయితే, అక్కడ తమకు ఊహించలేనంతగా ప్రశంసలు వచ్చాయన్నారు. ఆపై ఈ చిత్రం అవార్డును కూడా సొంతం చేసుకుందని గుర్తుచేసుకున్నారు. కానీ, మనవాళ్లందరూ మాత్రం నేనోక చెత్త సినిమా తీశానన్నారు. కనీసం పెద్దలు కూడా చూడలేనంతగా అశ్లీల చిత్రాన్ని తెరకెక్కించానని విమర్శించారు. 

కానీ, అంతర్జాతీయ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. టీజర్‌ తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ సెన్సార్‌ సూచన మేరకు కొన్ని సీన్లు కట్‌ చేసి తమిళ్‌లో విడుదల చేశాం. అక్కడ వచ్చిన రివ్యూలు చూసి మనసు కుదుటపడింది. ఆ సమయంలో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. కొద్దిరోజుల తర్వాత మా కుటుంబసభ్యులను తీసుకొని థియేటర్‌కు వెళ్లాను. సినిమా పూర్తి అయ్యాక వాళ్లు నన్ను విమర్శించలేదు. అప్పుడు అర్థమైంది. సినిమా బాగుంది అనిపించింది. కానీ  ప్రజల ఆలోచన తీరు ఆ సమయంలోనే నాకు అర్థమైంది’’ అని వర్షా (Varsha Bharath) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ సినిమా టీజర్‌ విడుదల తర్వాత ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ మూవీని నిర్మించిన వెట్రిమారన్‌, అనురాగ్‌ కశ్యప్‌పైనా చాలామంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా సినిమాను విడుదల చేయకండి అంటూ నినాదాలు చేశారు. దీంతో సెన్సార్‌ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)