Breaking News

హీరోయిన్‌ని టచ్‌ చేస్తానంటే నో చెప్పా.. జీవిత ఏం అన్నారంటే..: డైరెక్టర్‌

Published on Wed, 08/27/2025 - 14:36

రాజశేఖర్‌( Rajasekhar) పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రాల్లో అంకుశం, సింహారాశి కచ్చితంగా ఉంటాయి. నైంటీస్‌ జనరేషన్‌కి అంకుశం ఫేవరేట్‌ అయితే.. ఆ తర్వాతి తరానికి ‘సింహారాశి’ మాత్రమే గుర్తుంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ ఉన్నప్పటికీ.. హీరో మాత్రం ఆమెను టచ్‌ కూడా చేయడు. కథ ప్రకారం ఆయన ఆడవాళ్లను ముట్టుకోవద్దు. అయితే పాటల్లో మాత్రం ముట్టుకోవడానికి రాజశేఖర్‌ ట్రై చేశాడట. కానీ డైరెక్టర్‌ వద్దని చెప్పడంతో పాటల్లో కూడా హీరోయిన్‌ని టచ్‌ చేయలేదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకుడు సముద్ర చెప్పాడు.

‘మా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం సింహారాశి. అందులో రాజశేఖర్‌ అద్భుతంగా నటించాడు. కథ ప్రకారం ఆయన అమ్మాయిలను టచ్‌ చేయొద్దు. ఎందుకంటే ప్లాష్‌ బ్యాక్‌లో తల్లి తనను పట్టుకోకుండా పెంచి పెద్ద చేసి సూసైడ్‌ చేసుకొని చచ్చిపోతుంది. తన తల్లి తాకని ఈ శరీరాన్ని ఎవరూ తాకొద్దని హీరో ఒక సన్యాసిలా బతుకుతాడు. అటువంటి వాడిని ఒక హీరోయిన్‌ వచ్చి ప్రేమించి, అతన్ని మార్చి ఎలా పెళ్లి చేసుకుంది’ అన్నది సింహారాశి కథ.

సినిమా అన్నాక సాంగ్స్‌ కచ్చితంగా ఉంటాయి. పాటలన్నీ బాగా వచ్చాయి. అవి చూసి రాజశేఖర్‌ ఆనందంతో డ్యాన్స్‌ చేసేవాడు. ఓ సాంగ్‌ కోసం ఊటీకి వెళ్లాం. షూటింగ్‌ చేస్తుంటే.. హీరోయిన్‌(సాక్షి శివానంద్‌)ని పట్టుకోవాలని కొరియోగ్రాఫర్‌ చెప్పాడు. నేను మాత్రం హీరోయిన్‌ని టచ్‌ చేయొద్దని చెప్పా. 

అప్పుడు రాజశేఖర్‌ వచ్చి ‘అదేంటి? ఇది డ్రీమ్‌ కదా.. డ్రీమ్‌లో కూడా అమ్మాయిని పట్టుకోవద్దా?’ అని అడిగాడు. డ్రీమ్‌ అయినా..లైవ్‌ అయినా.. అసలు అమ్మాయినే పట్టుకోవద్దని చెప్పా. ‘లేదు సముద్ర, ఫ్యాన్స్‌ గోల చేస్తారు. నేను పట్టుకుంటా’ అని రాజశేఖర్‌ అన్నారు. ‘సార్‌.. మీకు దండం పెడతా..వద్దు వదిలేయండి’ అని చెప్పా.  జీవిత కూడా నాకే సపోర్ట్‌ చేసింది.  ‘అన్ని చేశారు కదా బంగారం.. డైరెక్టర్‌ ఏదో కుతూహల పడుతున్నాడు విను’ అని చెప్పింది. జీవిత చెప్పడంతో రాజశేఖర్‌ హీరోయిన్‌ని పట్టుకోకుండానే పాటను పూర్తి చేశాడు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)