Breaking News

బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?

Published on Wed, 06/11/2025 - 07:15

'గుంటూరు కారం' తర్వాత ఏడాదిన్నర నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ కోసం భారీ మైథలాజికల్ స్టోరీ ఒకటి సిద్ధం చేశారు. త్వరలో అనౌన్స్‌మెంట్ వచ్చేస్తుంది అనుకునే టైంలో బన్నీ లైనప్ మారింది. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్‌ని కాదని అట్లీతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మాటల మాంత్రికుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి. అలానే ఎవరితో సినిమా చేయాలా అని త్రివిక్రమ్ పూర్తిగా కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన గురించి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్‌తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. అలా అని ఇది ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. రామ్ చరణ్, వెంకటేశ్‌తో వరసగా మూవీస్ చేస్తారని, ఇవి పూర్తయిన తర్వాత తారక్‌తో మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. అంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్‌తో ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని వస్తాడని టాక్.

(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)

'అరవింద సమేత' తర్వాతే త్రివిక్రమ్-ఎన్టీఆర్‌తో మరోసారి పనిచేస్తారని కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అదే కథతో త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తీశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ఇది నిజమో కాదో సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఒకరు చేయాల్సిన స్టోరీతో మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీ కూడా ప్రస్తుతం అట్లీతో చేస్తున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ ఉంటుంది. లేదంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా, పుష్ప 3 మూవీస్ ఉండనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమా మిస్ అంటున్న వార్తలు నిజమేనా? లేదంటే పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో త్రివిక్రమ్-రామ్ చరణ్ మూవీ గురించి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)