Breaking News

నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు: ఎస్వీ కృష్ణారెడ్డి

Published on Mon, 06/02/2025 - 01:00

‘‘నా సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లందరూ స్వతహాగా ప్రతిభ ఉన్నవారు. నా చిత్రాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేకానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం (జూన్‌ 1) హైదరాబాద్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ, అండగా నిలబడిన నిర్మాత అచ్చిరెడ్డిగారికి కృతజ్ఞతలు.

దర్శకుడిగా నాకు తొలి చాన్స్‌ ఇచ్చిన హీరో రాజేంద్రప్రసాద్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ– ‘‘కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో చేసిన ‘శుభలగ్నం’ చిత్రం నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఆయన సృజనాత్మకతలో ఎంత ముందు చూపు ఉందో ఊహించుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ వేడుకల్లో మురళీమోహన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, అలీ, బండ్ల గణేశ్, లయ, ఇంద్రజ, ఆమని, సుచిత్రాచంద్రబోస్‌ తదితరులు పాల్గొని, ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు