Breaking News

ఐపీఎల్ ఫైనల్.. ఎవరు గెలిచినా అది మాత్రం తప్పదు: ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్

Published on Mon, 06/02/2025 - 13:09

ఐపీఎల్‌ క్వాలిఫయర్-2 మ్యాచ్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ముంబయితో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ అద్భుతమైన విజయం సాధించడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బుమ్రా, బౌల్ట్ యార్కర్లను థర్ట్‌ మ్యాన్‌ దిశగా బౌండరీకి తరలించడంపై కెప్టెన్ శ్రేయస్ అ‍య్యర్‌ను కొనియాడారు. అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.

గతంలో ఢిల్లీ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను వదిలేశారని.. ఆ తర్వాత  కోల్‌కతాకు ట్రోఫిని అందించినా శ్రేయస్‌ అయ్యర్‌ను మళ్లీ తీసుకోలేదని రాజమౌళి పోస్ట్ చేశారు. ఈ ఏడాది దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ను ఫైనల్‌ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్‌ టైటిల్‌ కొట్టేందుకు పూర్తిగా ‍అర్హుడని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా బెంగళూరు తరపున వేల పరుగులు సాధించాడని.. కానీ టైటిల్‌ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని రాసుకొచ్చాడు. ఈ ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం ఏదైనా హార్ట్‌ బ్రేకింగ్‌ మాత్రం తప్పదని అంటున్నారు రాజమౌళి.

ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన దర్శకధీరుడు క్రికెట్‌పై ట్వీట్‌ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో ఓ భారీ అడ్వెంచరస్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇటీవలే ఒడిశాలో రాజమౌళి- మహేశ్ ‍బాబు సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
 

 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)