Breaking News

రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్‌తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు

Published on Mon, 06/16/2025 - 11:16

మలయాళంలో ఇటీవల బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం తుడరుమ్‌ (Thudarum Movie). మోహన్‌లాల్‌, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్‌ నిలిచింది. తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

2020లో రాసుకున్న కథ
తాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్‌ సనల్‌ కుమార్‌ శశిధరణ్‌ (Sanal Kumar Sasidharan) తుడరుమ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్‌​ రాశాను. తుడరుమ్‌ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.

డైలాగ్‌ కూడా నాదే!
తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్‌ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్‌ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్‌లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్‌లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్‌ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్‌లో వాడుకున్నారు.

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌
ఎంతో అనుభవమున్న దొంగలు కూడా  ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్‌లో ఈ డైలాగ్‌ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్‌, టోవినో థామస్‌, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను అని రాసుకొచ్చాడు.

చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్‌కు అర్చకుల సూచన

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)