‘రాజు వెడ్స్‌ రాంబాయి’ అలాంటి కథే : దర్శకుడు

Published on Sun, 11/16/2025 - 11:05

‘‘2004లో జరిగిన ఓ వాస్తవ ఘటన గురించి నా చిన్నప్పుడు విన్నాను. ఆ నేపథ్యంలో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కథ రాసుకున్నాను. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు... కానీ, అలాంటిదే. ప్రేమికులకు ఏం జరిగింది? అనేది మాత్రం తెరపైనే చూడాలి’’ అని డైరెక్టర్‌ సాయిలు కంపాటి తెలిపారు. అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్, మాన్‌సూన్‌ టేల్స్‌ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. 

ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సాయిలు కం΄ాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్స్‌ వేణు ఊడుగుల, శ్రీకాంత్‌ అడ్డాలగార్ల దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. వేణు ఊడుగుల అన్నకు నేను చెప్పిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కథ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్‌ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యారు. 

ఈ సినిమా ఔట్‌పుట్‌ చూసి వేణు అన్న, బన్నీ వాసు, వంశీ నంది΄ాటిగార్లు సంతోషించారు. మా కంటెంట్‌ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నెల 21న ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా ఒత్తిడిగా భావించడం లేదు. నా తదుపరి సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. వేణు అన్న ఓ నిర్మాతగా ఉంటారు. ఆ ్ర΄ాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)